సర్పంచ్గా గెలిపిస్తే, అభివృద్దిని చేసి చూపిస్తా
–సయ్యద్ హైమ్మద్, కొప్పర్గ
తనకు సర్పంచ్గా గెలిపిస్తే అభివృద్దిని చేసిచూపిస్తానని సయ్యద్ హైమ్మద్ అన్నారు. తన తండ్రి సయ్యద్ ఖలీల్ ఐదేండ్లకాలంలో అభివృద్దిని చేసిన ఇంకా అభివృద్ది చేయవలసి ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ దుర్వినియోగం కాకుండ నీతినిజాయితితో ఖర్చుచేస్తానని తెలిపారు. మా నాయన సర్పంచ్ గా చేసిన సమయంలో గ్రామంలో హల్త్ సెంటర్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సీసీరోడ్లు, హిందు,ముస్లీంల శ్మాసనవాటికలకు వెళ్లెదారిలో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సర్పంచ్గా తనకు గెలిపిస్తే గ్రామంలో ప్రజలు ఎదుర్కోంటున్నా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. 24గంటల పాటు ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన తాను ముందుండి పరిష్కరిస్తానని, ఎల్లపుడు సేవచేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. తనకు ఆదరించి, ఆశీర్వాదించి, ఓటు వేసి గెలిపించాలని కోరారు.


