Friday, February 27, 2026

సర్పంచ్ పోటీలో ఆర్మీ ఎక్స్ సర్వీస్మేన్

సర్పంచ్ పోటీలో ఆర్మీ ఎక్స్ సర్వీస్మేన్
–గ్రామాన్ని అభివృద్ది చేయడమే తన ద్ద్యేయం
యువత కోసం గ్రంథాలయాన్ని నిర్మాణం చేపడుతాను
–చెన్నూరు దమ్మారెడ్డి
బోధన్: ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ది చేయడం, యువత కోసం గ్రాంథలయం ఏర్పాటు చేయడం తన ద్ద్యేయమని చెన్నూరు దమ్మారెడ్డి తెలిపారు. ఆర్మీలో పదేండ్లపాటుగా దేశసేవ చేసి, తన గ్రామానికి సేవచేయడానికి, నిరుద్యోగులకు గ్రంథలయాన్ని నిర్మాణం చేపట్టడానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు దమ్మారెడ్డి తెలిపారు. గ్రామానికి గతంలో పాలించిన సర్పంచ్లు అభివృద్దిని చేసిన ఇంకా ఎంతో అభివృద్దిని చేయవలసి ఉందని తెలిపారు. గతంలో తాను గ్రామాభివృద్ది కమిటి చైర్మెన్గా చేసిన సమయంలో దేవాలయాలు, రోడ్లు నిర్మాణం చేసినట్లు తెలిపారు. ప్రధానంగా గ్రామంలో 10వ తరగతి వరకు స్కూల్ ఉందని, విద్యార్థులు చెడదారిని పడకుండ వారికోసం గ్రంథాలయాన్ని నిర్మాణం చేయిస్తానని తెలిపారు. అలాగే తాను ఒక బక్సార్ నని విద్యార్థులకు చదువుతోపాటుగా ఆటస్థలం, క్రీడాలపట్ల ఆసక్తి కలిగించలన్నారు. అలాగే గ్రామప్రజలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కోంటున్నారని తెలిపారు. మంజీర నుంచి వేసిన పాతపైపులైన్ తీసివేసి కొత్తపైప్ లైన్ వేయించలన్నారు. గ్రామంలో రోడ్డు, డ్రైనేజీలు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఫండ్స్ దుర్వినియోగం కాకుండ నితినిజాయితితో ఖర్చుచేయలన్నారు. రైతులకు తాను వినూత్న పద్దతులో వ్యవసాయం చేయడానికి కృషిచేస్తానని తెలిపారు. ఇప్పటికే తాను ఆదర్శరైతుకు రెండు సార్లు అవార్డులు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామస్తులు అవకాశం కల్పిస్తే తాను గ్రామానికి సేవచేయడానికి అవకాశం కల్పించాలని దమ్మారెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular